పంజాబ్‌ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!

  • రెండు హోమ్‌ గ్రౌండ్స్‌ ఎంచుకోవడం తప్పు
  • సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌ ఎప్పుడూ అలా చేయలేదు
  • ధర్మశాలలో ఆడడం కష్టం
  • మేనేజ్‌మెంట్‌ నిర్ణయాల వల్లే ఈ దుస్థితి
ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండడంపై టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన పంజాబ్‌.. తర్వాత వరుసగా ఐదింట్లో ఓడిపోయింది. దీనికి జట్టు యాజమాన్యం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మండిపడ్డాడు. ఒకే సీజన్‌లో ముల్లాన్‌పూర్‌, ధర్మశాల అంటూ రెండు వేర్వేరు స్టేడియాలను హోమ్‌ గ్రౌండ్స్‌గా ఎంచుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు.

ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ లాంటి జట్లు ఎప్పుడైనా హోమ్‌ గ్రౌండ్స్‌ మార్చాయా అని అశ్విన్‌ ప్రశ్నించాడు. మొహాలీలో ఐదు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత అకస్మాత్తుగా వేదిక మారడం వల్లే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాల్సిన ప్రమాదం ఏర్పడిందని తెలిపాడు. బయట నుంచి చూసేవాళ్లకు పంజాబ్‌ సరిగా ఆడడంలేదని అనిపించొచ్చని, కానీ హోమ్‌ గ్రౌండ్స్‌ మార్చడం ముమ్మాటికీ తప్పని స్పష్టం చేశాడు. 

శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాలి. అయితే వీటిలో ఒకటి ధర్మశాలలో జరగనుండడంపై అశ్విన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ పిచ్‌ మొదట్లో బ్యాటింగ్‌కు అనుకూలించదని వివరించాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి బ్యాటర్లకు టైమ్‌ పడుతుందని చెప్పాడు.

Ravichandran Ashwin
Punjab Kings
IPL 2026
IPL
Indian Premier League
Home Ground
Dharamshala
Mullanpur
Shreyas Iyer
Cricket

More Telugu News